వైరల్ : టన్నుల్లో భారీ వెరైటీస్ ఆహారం ఏర్పాటు చేసిన ప్రభాస్.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమాలతో పాటుగా ఇటీవల తమ కుటుంబంలో జరిగినటువంటి విషాద ఘటన నుంచి తేరుకొని ఇతర కార్యక్రమాలు అయితే తాను చేయిస్తున్నాడు. మరి ప్రభాస్ ఆరడుగుల మంచితనం అని అంతా అంటుంటారు.

మరి అందుకు తగ్గట్టుగానే తన బంధువులు ఎవరైనా సరే తన కోసం వచ్చిన వారికి గాను  వంటలు సిద్ధం చేస్తారో తెలుసు ఈ విషయం లో అయితే ఎంతో మంది స్టార్స్ చెప్పారు. కానీ ఈరోజు మొదటిసారిగా అభిమానులు ప్రభాస్ అంటే ఏంటో తన ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో కళ్లారా చూసారు.

ఈరోజు మొగల్తూరులో ప్రభాస్ కృష్ణం రాజు కార్యం సందర్భంగా భారీ మొత్తంలో భోజన ఏర్పాట్లు చేసాడు. మరి అక్కడి వెరైటీలు ఎంత మొత్తంలో సిద్ధం చేసారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఏకంగా టన్నుల లెక్కల్లో ఒక్కో నాన్ వెజ్ వెరైటీ ని ప్రభాస్ రెడీ చేయించాడట.

6 టన్నులేసి మటన్, నార్మల్ బిర్యానీ, చికెన్ కర్రీ రెడీ చేయించాడట. అలాగే 4 టన్నులేసి చికెన్ ఫ్రై, చందువా ఫిష్, అలాగే టన్నుల్లో రొయ్యల్లో ఎన్నో వెరైటీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క నాన్ వెజ్ లోనే ఏకంగా 22 టన్నులకు పైగా చేయించాడట. ఇవి కాక ఇంకా నార్మల్ ఫ్రై లు, బూరెలు, గారలు అని ఎన్నెన్నో చేసి వచ్చిన అశేష అభిమాన జనానికి సిద్ధం చేయించి పెట్టి తన కొండంత ప్రేమని వ్యక్తపరిచాడు.