`సాహో` బడ్జెట్ పెరుగుతుంటే ఒకటే టెన్షన్
ఆగస్టు 30న సాహో రిలీజ్ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని మెట్రో నగరాల్ని చుట్టేస్తూ జెట్ స్పీడ్ తో ప్రచారం చేస్తున్నాడు. మరో మూడు రోజుల్లో సాహో రిజల్ట్ రాబోతోంది కాబట్టి ప్రభాస్ లోనూ టెన్షన్ అంతకంతకు పెరుగుతోందన్నది అర్థమవుతోంది. తాజాగా హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. బాహుబలి తర్వాత ఆడియెన్ ని .. అభిమానుల్ని కన్విన్స్ చేసేందుకే ఇంత భారీ బడ్జెట్ చిత్రంలో నటించానని తెలిపారు. నిజానికి బాహుబలి సిరీస్ తర్వాత ఒక మామూలు చిత్రంలో నటించాలని అనుకున్నాను. కానీ సాహో బడ్జెట్ అంతకంతకు పెరిగిందని వెల్లడించారు.
నిజానికి సాహోకి 150 కోట్ల బడ్జెట్ అనుకున్నాం. కానీ అంతకంతకు పెరిగింది. 350 కోట్లు ఖర్చయ్యింది. అలా బడ్జెట్ పెరుగుతుంటే నిదుర పట్టలేదు అని అన్నారు. నాలుగు రోజుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ తనను నిలబడనీయడం లేదని అతడి మాటల్ని బట్టి అర్థమైంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజవుతుంటే డ్రీమ్ లో తేలుతున్నట్టే ఉందని అన్నారు. అయితే ఇంత పెద్ద బడ్జెట్ సినిమా తీయడానికి కారణం .. రాజమౌళి ఏదో మాయ చేసేశాడని ప్రభాస్ వ్యాఖ్యానించారు. బాహుబలి చేయడమే ఈ సినిమాని ఇంత పెద్దగా చేయడానికి కారణమని అన్నారు. నాలుగు రోజుల తర్వాత ఆడియెన్ ఏం చేస్తారో చూడాలి! అన్న ఎగ్జయిట్ మెంట్ ని కనబరిచారు. మొత్తానికి డార్లింగ్ కి ఈ నాలుగు రోజులు కంటిపై కునుకు పడితే ఒట్టు!