కాజ‌ల్‌ని డార్లింగ్ అంత మాట‌న్నందుకు తానేమందంటే?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు డ్రెస్ సెన్స్ లేద‌ట‌!

`సాహో` రిలీజ్ స‌మ‌యంలో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ అలిగింద‌ని, ఆమెతో చేయాల్సిన స్పైసీ సాంగ్‌ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో చేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా వుంటే టాలీవుడ్ హంక్ ప్ర‌భాస్ పై కాజ‌ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. హాలీవుడ్ హీరోలు ఐర‌న్ మెన్‌, హ‌ల్క్ ఆ ఇద్ద‌రూ క‌లిస్తే ప్ర‌భాస్ అని చ‌మ‌త్క‌రించడం ప‌లువురిని ఆక‌ట్టుకుంది. ఇది జ‌రిగి రెండు వారాల‌వుతోంది. తాజాగా కాజ‌ల్ చేసిన కామెంట్‌పై ప్ర‌భాస్ స్పందించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

`సాహో` ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంట‌ర్య్వూలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌పై డార్లింగ్  ప్ర‌భాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ మోస్ట్ బ్యూటిఫుల్. అండ్ ఎన‌ర్జిటిక్‌. అయితే ఆమె అందానికి త‌గ్గ‌ట్టుగా కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం ఆమె డ్రెస్ సెన్స్ యావ‌రేజ్‌గా వుండేది. కానీ ఇప్ప‌డు త‌న టేస్ట్‌లో మార్పొచ్చింది` అంటూ ప్ర‌భాస్ చేసిన కామెంట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌భాస్‌తో క‌లిసి కాజ‌ల్ అగ‌ర్వాల్ `డార్లింగ్‌`, `మిస్ట‌ర్‌ప‌ర్‌ఫెక్ట్‌` వంటి చిత్రాల్లో న‌టించారు. ఈ రెండూ సూప‌ర్ హిట్సే. మ‌రోసారి ఈ జంట క‌లిసి న‌టిస్తే చూడాల‌ని డార్లింగ్ అభిమానుల‌తో పాటు కాజ‌ల్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

అత‌డు హ‌ల్క్ + ఐర‌న్‌మ్యాన్

అన్న‌ట్టు ప్ర‌భాస్ త‌న‌ని అంత మాట అన్నా కానీ.. అదేమీ మ‌న‌సులో పెట్టుకోకుండా కాజ‌ల్ తాజా ఇంట‌ర్వ్యూలో డార్లింగ్ ని వెన‌కేసుకొచ్చింది. ప్ర‌భాస్ గురించి ఒక మాట చెప్పండి అన‌గానే.. అత‌డో ఐర‌న్ మ్యాన్ – హ‌ల్క్ ఇద్ద‌రినీ క‌లిపితే ప్ర‌భాస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఐర‌న్ మ్యాన్ లా తెలివైన‌వాడు.. హ‌ల్క్ లా బ‌ల‌మైన‌వాడు అంటూ అద్భుత‌మైన ప్ర‌శంస‌ను కురిపించింది. మొత్తానికి ప్ర‌భాస్ అంటే కాజూకి అంత ఇది ఉన్న‌ప్పుడు అత‌డెందుక‌లా అనేశాడు? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. కాజ‌ల్ ప్ర‌స్తుతం `పారిస్ పారిస్‌, అ!-2, ముంబై సాగా, సూర్య 39వ చిత్రంతో పాటు అల్లు అర్జున్ న‌టిస్తున్న `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌బోతోంది.