హాట్ టాపిక్: ప్రభాస్‌ని చెంపమీద కొట్టింది (వీడియో)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని చెంప మీద కొట్టింది ఆ అమ్మాయి అంటూ మీడియాలో ఉదయం నుంచి తెగ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ప్రభాస్ ని కొట్టే ధైర్యం చేసే అమ్మాయి ఎవరు..కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందీ అంటే… సరదాగా ..ముద్దగా ఆమె చిన్నగా ప్రభాస్ చెంపపై అలా తట్టింది. దాన్నే మన మీడియా రచ్చ రచ్చ చేస్తోందన్నమాట.

సరే ఆ సరదా సంఘటన ఏమిటో చూద్దాం. రీసెంట్ గా ప్రభాస్ కు ఎయిర్ పోర్ట్ లో ఈ సరదా సంఘటన ఎదురైంది. దాన్ని క్రింద వీడియో చూడవచ్చు. ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఓ అమ్మాయి. ప్రభాస్ ని చూడగానే సంతోషం పట్టలేకపోయింది. వెంటనే ఫోటో కోసం ప్రభాస్ ని రిక్వస్ట్ చేసింది. ప్రభాస్ తన ఫ్యాన్ పై ప్రేమతో ఫొటోకు ఓకే అన్నాడు. ఫొటోకు ఫోజు ఇస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయి . నవ్వుతూనే ఉంది. ఆమె సంతోషాన్ని చూసి ప్రభాస్ కూడా మురిసిపోయాడు.

ఇక ఫోటో పూర్తయ్యాక ప్రభాస్ పక్కన నిలబడి సంతోషంతో గంతులేసింది. ఆ అమ్మాయి సంబరం అక్కడితో ఆగిక…. వెళుతూ వెళుతూ ప్రభాస్ చెంపై సాఫ్ట్ గా కొట్టేసి వెళ్ళింది. దీనితో ప్రభాస్ ఇంకోసారి నవ్వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఉన్నది ఒక ఇండియన్ యువతే కాబట్టి సరిపోయింది.. లేకుంటే ప్రభాస్ హాట్ హాట్ ముద్దులతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు.