సోషల్ మీడియా ‘బాహుబలి’ ప్రభాస్

సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ప‌లు సోషల్ మీడియా సైట్ లలో త‌మ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో పాటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన వివ‌రాలు అందిస్తూ ఫ్యాన్స్ కు పండుగ చేస్తున్నారు. అయితే ప్ర‌భాస్ మాత్రం కేవ‌లం సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్‌లో ఒక‌టైన ఫేస్ బుక్‌ని మాత్ర‌మే వాడుతున్నాడు.

అక్కడ ప్ర‌భాస్ ఫాలోవ‌ర్స్ సంఖ్య ప‌ది మిలియ‌న్స్‌కి చేరింది. అతి త‌క్కువ టైంలో ప్రభాస్ ఈ ఫీట్‌ని సాధించగా, సౌత్‌లో ప‌ది మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సాధించిన తొలి న‌టుడు ప్ర‌భాస్ కావ‌డం విశేషం. ప్ర‌భాస్ ఖాతాలో స‌రికొత్త రికార్డ్ చేర‌డంతో ఈ ఆనంద స‌మ‌యాన్ని ఫ్యాన్స్ ఇదొక ఉత్సవంలా జరుపుకుంటున్నారు.

ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే… బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో సినిమాతో పాటు జిల్ ఫేమ్ … రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల పై అభిమానుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి.