కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వరుస ప్రాజెక్టులతో హీట్ పెంచేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి సంస్థలో ఎన్టీఆర్ హీరోగా చిత్రానికి సన్నాహాలు చేస్తుండగానే.. మరోవైపు ప్రభాస్ తో హోంబలే ఫిలింస్ సినిమాకి అతడు ప్లాన్ రెడీ చేశాడని ప్రచారమవుతోంది.
ఇదేగాక.. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ కి అతడు ఓ కమిట్ మెంట్ ఇచ్చారన్న ఓ ప్రచారం ఉంది. అది ఏ హీరోతో అన్నది అటుంచితే ప్రభాస్ తో సినిమా గురించి మరో ఆసక్తికర విషయం తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం… ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో కలిసి మాఫియా థ్రిల్లర్ చేయనున్నాడట. ఈ చిత్రం విదేశాలలో కొన్ని విలాసవంతమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తారట. ఒకవేళ ఇదే నిజమైతే బహుశా ఇంటర్నేషనల్ మాఫియా కాన్సెప్టుతో ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేస్తారని భావించవచ్చు. అంటే ప్రభాస్ ని అంతర్జాతీయ మాఫియా డాన్ గా చూపిస్తారా? అన్నది వేచి చూడాలి.