‘జిల్’ చిత్రాన్ని రూపొందించిన రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫన్ అండ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూమర్స్ అని చాలా మంది కొట్టిపారేసారు. అయితే అదే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.
అయితే ఈ చిత్రానికి పనిచేస్తున్న టాప్ టెక్నీషియన్ కమల్ కణ్ణన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జాన్’ చిత్రం ఇటలీ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందని అన్నారు. ఈ మాటతో ఆ టైటిల్ నే ఫిక్స్ చేశారని అర్దమవుతోంది.
పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త లుక్ లో కనబడనున్నాడు. గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది.
ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడి పాత్ర చేస్తున్నారని, దొంగ పాత్ర అని వార్తలు వచ్చాయి. ఈ కార్లను దొంగలించే ప్రయత్నంలోనే హీరోయిన్ పూజాతో ప్రేమలో పడతారట. ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 1920ల కాలంలో జరగనుంది. ఇందుకోసం పురాతన కార్లను, సెట్లను డిజైన్ చేసి వాడుతున్నారు. 2020లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: అమిత్ త్రివేది.