ప‌వర్‌స్టార్ అభిమాని మ‌ర‌ణంపై తీవ్ర‌ ఆందోళ‌న‌

ఉప్పెన రీమేక్ తో ప‌వ‌ర్ స్టార్ త‌న‌యుడు ఎంట్రీ!

ఉప్పెన రీమేక్ తో ప‌వ‌ర్ స్టార్ త‌న‌యుడు ఎంట్రీ!సౌత్‌లో ర‌జ‌నీకాంత్ త‌ర్వాత‌ అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్‌గా ద‌ళ‌ప‌తి విజ‌య్ పాపుల‌ర‌య్యాడు. త‌ళా అజిత్ లాంటి స్టార్ హీరో ఎంత‌గా పోటీ ఇచ్చినా విజ‌య్ యూనిక్ స్టైల్ ని తంబీలు అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. ఇక విజ‌య్ అంటే చెవి కోసుకునే వీరాభిమానం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే. అత‌డి జీవితంలో ప్ర‌తి అంకాన్ని ఫ్యాన్స్ ఎంతో ఇదిగా త‌ర‌చి చూస్తుంటారు. త‌మ ఫేవ‌రెట్ క‌ష్టాన్ని త‌మ క‌ష్టంగా భావిస్తుంటారు. ఇక విజ‌య్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌మ‌య‌మాస‌న్న‌మైందని ఒక సెక్ష‌న్ ఫ్యాన్స్ చాలా కాలంగా బ‌హిరంగ వేదిక‌ల‌పై నినాదాలు ఇస్తున్నారు. త‌మిళ‌నాడులో రాజ‌కీయ శూన్య‌త కొన‌సాగుతోంది. విజ‌య్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సీఎం అవ్వాల‌న్న‌ది అభిమానుల బ‌ల‌మైన కోరిక‌. కానీ ద‌ళ‌ప‌తి ప్లానింగ్ మాత్రం వేరుగా ఉంది.

ఇక తానంటే ప‌డి చ‌చ్చే అభిమానుల‌కు ప‌వ‌ర్ స్టార్ విజ‌య్ ఇచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. అయితే విజ‌య్ ని ఎంతో గొప్ప‌గా అభిమానించే ఓ వీరాభిమాని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం తాజాగా త‌మిళ‌నాడు వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీంతో అభిమానులంతా ట్విట్ట‌ర్ లో త‌మ సంతాపం తెలియ‌జేయ‌డ‌మే గాక ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాల్లో #RIP బాలా విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ ఘ‌ట‌న‌ చాలా మంది విజయ్ అభిమానులను బాధపెట్టింది.

ఏదైనా సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు #RIPBala అంటూ ఓ అభిమాని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశాడు. మొత్తం తలపతి అభిమానులకు బ్లాక్ డే .. #RIPBala pic.twitter.com/2LlL3BmZef అంటూ ప్ర‌చారం హోరెత్తుతోంది. మీ సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు.. మిస్ యు బ్రదర్ # RIPBala అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.

ప్రతి ద‌ళ‌పతి అభిమానికి.. ఇత‌ర నటుల అభిమానులకు ఒక చిన్న అభ్యర్థన .. దయచేసి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోకండి.. అది సరైన విషయం కాదు .. మీకు మీ స్నేహితులకు స‌మ‌స్య‌ను షేర్ చేసుకుంటే మంచిది. లేదా సహాయం చేయమని అడగండి … అంటూ ఎక్కువ మంది సూచించారు.

ఇక ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన బిగిల్ గ‌త ఏడాది రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం మాస్టార్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్రను పోషిస్తున్నారు. కోవిడ్ విల‌యం వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి విధిత‌మే.