ఇటీవలి కాలంలో కాంట్రవర్శీ క్వీన్స్ గా పాపులారిటీ దక్కించుకుంది పూనమ్ కౌర్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్ లపై వరుస ట్వీట్లు చేస్తూ తన ఇమేజ్ ని ఫాలోవర్స్ ని పెంచుకుంది. కత్తి మహేష్ ఎపిసోడ్ తో పరాకాష్టకు చేరుకుంది. తాజాగా ఓ వివాదాస్పద నటిపై తనదైన శైలిలో విరుచుకుపడడం ఫ్యాన్స్ లో చర్చకు వచ్చింది.
ఇంతకీ ఏమిటా వార్? అంటే.. పూనమ్ కౌర్ తాజా ట్వీట్ ని పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. “ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత, ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేయసి, భార్యగా ఉండటం ఒక బాధ్యత, బాధ్యత ప్రేమతో క్యారెక్టర్‌తో వస్తది, ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు అని క్యారెక్టర్ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగం“ అంటూ ఘాటైన వ్యాఖ్యానం చేసింది పూనమ్. ఈ ట్వీట్ ఎవరిని ఉద్ధేశించి అన్నది ఆరా తీస్తే.. వివాదాస్పద నటి శ్రీరెడ్డిపైనే ఇలా పేరు లేకుండా విరుచుకుపడింది అనేది అభిమానుల మాట.
ఇంతకీ పూనమ్ కి శ్రీరెడ్డికి మధ్య లొల్లేమిటి? అన్నది చూస్తే.. మొన్న పూనమ్ ట్వీట్ పై శ్రీరెడ్డి ఓ రేంజులోనే పంచ్ వేసింది. “పూనమ్ అక్క పీకే మాస్క్ వేసుకోవడం ఎందుకు? మా అందరికీ పీకే కి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు.. మాస్క్ కే పీచ్ క్యా హై??“ అంటూ సెటైరికల్ గా వ్యాఖ్యానించింది. దానికి కౌంటర్ గానే ఇప్పుడు పూనమ్ రివర్స్ కౌంటర్ వేసిందని ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. అయితే తాజా ట్వీట్ లో పూనమ్ ఎక్కడా శ్రీరెడ్డి అన్న పేరును మాత్రం ఉపయోగించలేదు. ఒక అమ్మాయి అంటూ విరుచుకుపడింది. పూనమ్ రెస్పాన్స్ పై శ్రీరెడ్డి స్పందన ఏమిటో చూడాలన్న ఆత్రం కుర్రాళ్లలో కనిపిస్తోంది మరి.
Oka daughter ga undadam oka badyata,
oka sister ga undadam oka badyata,
oka premika inka bharya ga undadam oka badyata,
badyata prema toh character toh ostadi,freedom ani amma nanna ni odlesi ,dabbu anicharacter ni odlesina ammai oka vaishya kantey darunam.ManishigaMaruo mrugam— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 29, 2020