పూన‌మ్ ఎద‌పై ఏంటా గుర్తులు!

పోయి పోయి పెద్దాయ‌న‌పై ప‌డ్డావేంటి అమ్మ‌డు?

దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్‌కౌంట‌ర్ చేయ‌కుండా రెండు బెత్తెం దెబ్బ‌లు కొడితే ప‌రిపోయేద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. వెంట‌నే స్పందించిన పూన‌మ్‌కౌర్ దానికి కౌంట‌ర్‌గా అన్న‌ట్టు.. ప‌వ‌న్‌ని ప‌రోక్షంగా ఉద్దేశిస్తూ అలా మాట్లాడిన వాళ్ల‌కి కూడా రెండు బెత్తెం దెబ్బ‌లు అని ట్వీట్ చేసి వెంట‌నే ఆ ట్వీట్‌ని డిలీజ్ చేసి వార్త‌ల్లో నిలిచింది.

స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేస్తున్న పూన‌మ్‌కౌర్ తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో వైర‌ల్‌గా మారింది. బ్లాక్ అండ్ ఫొటో.. ఎద‌పై టాటూ.. పాము, త్రిశూలం ఆకారంలో వున్న టాటూని త‌న ఎద అందాల‌పై ముద్రించుకున్న తీరు షాక్‌కు గురిచేస్తోంది. గ‌తంలో అదే ప్లేస్‌లో ప‌వ‌న్ పేరుని టాటూ వేయించుకుందంటూ సోస‌ల్ మీడియాలో నానా హంగామా జ‌రిగింది. తాజాగా ఎద అందాల‌పై పూన‌మ్ వేసుకున్న టాటూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పాము, త్రిశూలం గుర్తుల‌నే పూన‌మ్ ఎందుకు టాటూగా వేయించుకుంది?.. వాటి వెన‌కున్న అర్థ‌మేంటి? వాటి అర్థంలో ప‌వ‌న్ వున్నాడా? లేక ఇంకెవ‌రైనా వున్నారా? అన్న‌ది ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. మొత్తానికి తాజా టాటూతో పూన‌మ్ మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది అని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.