టాలీవుడ్ బాలీవుడ్ సహా సౌత్ లో అన్నిచోట్లా పూజా హెగ్డేకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. డీజే గాళ్ గా అటు మాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం. ప్రస్తుతం ఈ భామ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇదే సమయంలో అటు మాలీవుడ్ లోనూ అడుగు పెడుతోంది. అయితే అక్కడా టాలీవుడ్ రేంజులో పారితోషికం డిమాండ్ చేస్తోందన్నదే హాట్ టాపిక్.
దుల్కార్ సల్మాన్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాని ప్రకటించనున్నారు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. దుల్కార్ – పూజా జోడీ కుదిరితే బిజినెస్ రేంజ్ పెరుగుతుందనేది దత్ వారసురాళ్ల ఆలోచన. అయితే ఇక్కడే ఓ చిక్కు కూడా ఉంది.
కావాలి అని మీద పడితే ఎలా డిమాండ్ చేయాలో ఈ ముంబై బొమ్మకు తెలిసినంతగా వేరే ఎవరికీ తెలీదేమో! ఇదే అదనుగా పూజా హెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. ఇప్పటికే 2కోట్ల క్లబ్ నాయికగా పాపులరైంది కాబట్టి ఆ రేంజులో పారితోషికం అడిగిందట. అయితే అందుకు స్వప్న సినిమాస్ అంగీకరించిందని తెలుస్తోంది. జూన్ లో ఈ మూవీ సెట్స్ కెళ్లనుందని తెలుస్తోంది. ఇన్నాళ్లు కరోనా లాక్ డౌన్ వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా పెండింగులో పడిపోయిందట. ప్రస్తుతం పూజా ఇన్ స్టా మాధ్యమాల్లో లేటెస్ట్ ఫోటోల్ని షేర్ చేసి గుబులు పెంచుతోంది. ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.