పెద్ద సినిమాలకు పెద్ద తలనొప్పి పైరసీ. సినిమా హిట్, ప్లాఫ్ లను ప్రక్కన పెడితే పైరసీ .. సినిమాను దారుణంగా దెబ్బ తీస్తుంది. చెద పురుగులా చేరి మొత్తం కలెక్షన్స్ పైనే ఇంఫాక్ట్ చూపుతుంది. ఇప్పుడు మహర్షి సినిమకూడా అలాంటి పరిస్దితే ఎదురుకానుందా… అంటే అవుననే వినిపిస్తోంది.
గతంలో బాహుబలి, అజ్ఞాతవాశి, వినయవిధేయరామ , అరవింద సమేత తరహాలోనే ఈ సినిమాకు పైరీసీ ప్లాబ్లం పట్టుకోనుందంటున్నారు. లైవ్ స్టీమింగ్ వీడియోలు, షార్ట్ వీడియోలు ఈ పైరసీలో మేజర్ రోల్ ప్లాన్ చేస్తున్నాయి . ఈ విషయమై మహర్షి టైమ్ ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంది కానీ అవి సరిపోతాయా అనేది తెలియటం లేదు . ఫస్ట్ డే కలెక్షన్స్ పై వీటి ఇంపాక్ట్ పడతాయంటున్నారు ఫ్యాన్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే లీడ్ రోల్స్‌లో వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. రైతుల ఆత్మహత్యల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మషేహ్ బాబు గత రికార్డుల్ని బద్దలుకొట్టేలా అత్యధిక థియేటర్లలో ఈ మూవీ విడుదల అయింది.
దాదాపు 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవర్ సీస్ లో కూడా రికార్డు స్థాయిలో రెండువందల యాభై కు పైగా లొకేషన్స్ లో విడుదల చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా మంచి ఆసక్తిని కనబరుస్తోన్న నేపథ్యంలో ఈ మూవీని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. అయినా టికెట్లు మాత్రం దొరకడం లేదు. దాంతో చాలా మంది పైరసీని ఆశ్రయించే అవకాసం ఉంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు, వైజయంతీ మూవీస్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు.