సంక్రాంతి బరిలో రజినీకాంత్ “పేట” 

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “పెట్టా” చిత్రాన్ని “పేట” పేరుతో తెలుగు ప్రేక్షకులకు వల్లభనేని అశోక్ అనువదించిన సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది .

     ఈ సందర్భంగా  అశోక్ మాట్లాడుతూ  “సూపర్ స్టార్ హీరోగా  “పేట” అనే చిత్రాన్ని  తెలుగు ప్రేక్షకులకు అందిస్తునందుకు సంతోషంగా ఉంది.చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్భారాజ్ రజినీకాంత్ కు వీరాభిమాని. ఆయన గతం లో పిజ్జా,జిగర్తాండ చిత్రాలతో  హిట్ దర్శకుడి గా పేరున్న ఆయన రజినీకాంత్ ను తెరకెక్కించిన విధానం తెలుగు ప్రేక్షకులను బాగా నచ్చుతుంది .

అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి మెలోడీ  సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం లో ప్రతి ఒక్కరిపాత్రలు  ఆకట్టుకుంటాయి.అటు మాస్ ఆడియెన్స్ ను ,ఇటు క్లాస్ ఆడియెన్స్ కు నచ్చే కమర్షియల్ అంశాలున్నచిత్రమిది. అలాగే డార్జీలింగ్ వంటి హిల్  స్టేషన్లతో పాటు విదేశాల్లో కూడా చిత్రీకరించిన  ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దటం జరిగింది.అలాగే రజినీకాంత్ హిట్ మూవీ “బాషా” తరువాత మళ్ళీ సంక్రాంతి కి “పేట” రూపంలో థియేటర్లలో సందడి చేయటానికి  రావటం సంతోషంగా ఉంది జనవరి మొదటి వారంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి సంక్రాంతి కానుకగా రెండో వారంలో రిలీజ్ చేయనున్నాం” అన్నారు.

    ఈ చిత్రంలో త్రిష,సిమ్రాన్,విజయ్ సేతుపతి,బాబీ సింహ,నవాజుద్దీన్ సిద్ధికి మాళవిక నాయర్,మేఘ ఆకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: కార్తీక్ సుబ్భారాజ్,నిర్మాత: వల్లభనేని అశోక్.