పాయల్ రాజపుత్ ‘RDX లవ్’ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘RDX లవ్’. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్ర ధారులు. శనివారం ఈ సినిమా ఫస్ట్ ‌లుక్‌ని విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని, సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ విక్టర్ వెంకటేశ్ మొత్తం బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్‌తో పాటు పవర్ చిత్రం దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ), చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఫస్ట్ లుక్ విడుదల చేసి యూనిట్‌కి అభినందనలు తెలిపిన వెంకటేశ్‌కి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత సి.కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. శంకర్ భాను రచనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం, సి.రాంప్రసాద్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.