వైరల్ : అల్లు అరవింద్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి గట్టి డిమాండ్..నిజమవుతుందా?

టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ కూడా ఒకరు. అయితే అల్లు ఫామిలీ అలాగే మెగా ఫ్యామిలీ కి ఇప్పుడు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయినా కూడా మెగా మరియు అల్లు కుటుంబం మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటారు.

అయితే ఇది తెర మీదకి కాగా తెరవెనుక రాజకీయలు ఎలా  ఉంటాయో ఎవరికీ తెలీదు. ఇక పైగా అల్లు అరవింద్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇద్దరికీ మధ్య కోల్డ్ వార్ ఉందనే మాట అందరికీ తెలిసిందే.

మరి వీరి కాంబోలో కూడా పలు సినిమాలు అయితే వచ్చిన సంగతి కూడా తెలిసిందే. వాటిలో భారీ హిట్ “జల్సా” పవన్ ఫ్యాన్స్ కి ఒక అద్భుత మెమొరీ. అయితే ఈ సినిమా స్పెషల్ షో కోసం పవన్ ఫాన్స్ రచ్చ చేస్తూ నిర్మాత అల్లు అరవింద్ ని ఈ సినిమా కొత్త ప్రింట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే సందర్భంగా జల్సా ప్రింట్ ని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయని కాకపోతే కొత్త ప్రింట్ గా చేయడానికి అవుతుందో లేదో అని తెలుస్తుంది. మొత్తానికి అయితే సోషల్ మీడియాలో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పై ఈ రచ్చ నడుస్తుంది.