వైరల్ ఫొటో :‘2.0’పక్షిరాజా లుక్ కు బేస్ ఇదే

2010లో వచ్చిన సూపర్‌హిట్‌ ‘రోబో’ సీక్వెల్‌ ‘2.0’. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ విలన్ పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సినిమాను నిర్మించింది.

ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరిని ఎట్రాక్ట్ చేసిన పాత్ర ‘పక్షిరాజ’.తమిళనాడుకి చెందిన పక్షి ప్రేమికుడు సలీం అలీని ఆదర్శంగా తీసుకొని ఈ పాత్రను క్రియేట్ చేసారు శంకర్. ఇక పక్షిరాజ మేకప్ కూడా ప్లస్ అయ్యింది. మొబైల్ ఫోన్లన్ని కలిసి పక్షిరాజు రెక్కలుగా మారడం.. అతని ముఖంపై పక్షికి ఉన్న విధంగా ఈకలు ఉండటం.. ఇలా ప్రతీది నిజంగా పక్షే అనిపించేలా ఉంది. ఈ గెటప్ కు ప్రేరణ ఏదైనా ఉందా అంటే ఉంది అంటున్నారు.

పభిరాజా పాత్ర గెటప్‌కి రామాయణంలోని పక్షిరాజైన ‘జటాయువు’లుక్ ని బేస్ చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై ట్విట్టర్ లో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. జటాయివు బొమ్మ పెట్టి..పక్షిరాజా ఫొటో పెట్టి..కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.