బూతు గోల :నీకేం గంగా బొండాలు…నావే చిన్న బత్తాయిలు

ఆర్ ఎక్స్ 100 పుణ్యమా అని తెలుగులోనూ బూతు సినిమాలు జోరు పెరిగింది. తెలుగు,తమిళ భాషల్లో బూతు సినిమాలు ఊపందుకున్నాయి. చిన్న సినిమాలన్నీ పూర్తిగా అదే దారిలో ప్రయాణం పెట్టుకున్నాయి . తాజాగా బిగ్‌బాస్ ఫేం ఓవియా నటిస్తున్న తొలి చిత్రం ‘90 ఎంఎల్’ ఈ అడల్ట్ డైలాగులతో హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా తమిళంలో రిలీజైన ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాబోతోంది. అనిత ఉదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ లో డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇంక సినిమా ఏ స్దాయిలో ఉంటుందో అనే ఉత్సుకత రేపుతున్నాయి.

టీనేజ్ అమ్మాయిలంతా కూర్చొని మందు తాగటం, అసభ్యకర మాటలు మాట్లాడుకోవటం లాంటి ఎన్నో సన్నివేశాలు ఈ టీజర్‌లో చూపించారు. ఈ ట్రైలర్ అంతా డబుల్ మీనింగ్ డైలాగులతోను.. శృతి మించిన గ్లామర్ తోనూ.. లిప్ టు లిప్ కిస్ లతోను నింపేశారు.

90ML - Telugu Trailer | Oviya | STR | Alagiya Asura | NVIZ Entertainment

‘‘రేయ్.. నేను బిగ్‌బాస్‌నే చూసినదాన్నిరా’’ అంటూ ఓవియా చెప్పిన డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం రక్తి కట్టించే సన్నివేశాలతో యూత్‌ని ఆకట్టుకుంటూ వేగంగా వ్యూస్ రాబడుతోంది. కాగా ఈ టీజర్‌ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓవియా.. ఈ అడల్ట్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి అని పేర్కొంది.