కళ్యాణ్ రామ్ …ఆ మధ్యన వచ్చిన ‘పటాస్’ హిట్ తో కెరీర్ లో హిట్ దశ ప్రారంభమయ్యింది అని అంతా అనుకున్నారు. అయితే ఆ హిట్ సాగా కంటిన్యూ కాలేదు. మళ్లీ ప్లాఫ్ ల వరదలో కొట్టుకుపోతున్నారు. అయినా పట్టు వదలకుండా లక్ ని వెతుక్కుంటూ సినిమాలు చేస్తున్నారు. పనిలో పనిగా ..తమిళ దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా షాలిని పాండే – నివేదా థామస్ లు నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఇక ఈ చిత్రానికి ఒక నెంబర్ ను టైటిల్ గా ఖరారు చేసారు. సినిమా కథలో ‘118’ అనే నెంబర్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే అదే నెంబర్ ను సినిమా టైటిల్ గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
‘ఎమ్మెల్యే’ ‘నా నువ్వే’ చిత్రాలపై భారీ అంచనాలు పెట్టుకున్న కళ్యాణ్ రామ్ కు ఆ చిత్రాలు డిజాస్టర్స్ కావటంతో చాలా నిరాశ పర్చాయి. దాంతో ఈ సినిమాను చాలా లో ప్రొఫైల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు హడావిడి లేదు. అందుతున్న సమాచారం ప్రకారం రిలీజ్ కు ముందు ఎన్టీఆర్ ను పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈసారి నెంబర్ టైటిల్ ను నమ్ముకున్న కళ్యాణ్ రామ్ కు సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.