డిసెంబర్ 16న తిరుపతిలో ఎన్టీఆర్  బయోపిక్ ఆడియో

నందమూరి బాలకృష్ణ , విద్యాబాలన్, రానా , కళ్యాణ్ రామ్ సుమంత్ తదితరులు నటిస్తున్న “ఎన్టీఆర్ బయోపిక్ ” చిత్ర ఆడియో  కార్యక్రమం  వచ్చే నెల 16 న తిరుపతిలో జరపడానికి నిశ్చయించినట్టు తెలిసింది .

ఎమ్ ఎమ్  కీరవాణి సంగీత దర్శకత్వ వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లోని  పాటలు , మరికొన్ని కొంత మార్పుచేసినవి వుంటాయని అంటున్నారు .

ఎన్టీ రామారావు మొదటి తెలుగు దేశంపార్టీ ప్రచారం ప్రారంభించింది తిరుపతి నుంచే. ఈ సినిమా ఎన్నికల  ముందు  వస్తుంది కాబట్టి , తెలుగు దేశం శ్రేణులతో కలిపి అత్యంత  భారీ స్థాయిలో తిరుపతిలో చెయ్యాలనే సంకల్పతో ఉన్నట్టు తెలుస్తుంది . ఇందుకు చంద్ర బాబు నాయుడు కూడా సమ్మతి తెలిపినట్టు తెలిసింది .

డిసెంబర్ 7న తెలంగాణాలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి  16వ తేదీన పండితులతో బాలయ్య ముహూర్తం నిర్ణయించారట .ఈ కార్యక్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు లతో పాటు ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు , ఆయన మంత్రివర్గ  సహచరులు పాల్గొనే  అవకాశం వుంది .