‘అద్భుతం, అద్భుతం, అద్భుతం’ అంటూ ఎన్టీఆర్‌ ప్రశంస

నేచురల్‌ స్టార్ నాని గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. జెర్సీలో తన అద్బుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నేపధ్యంలో నానిని చూస్తే ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.

‘Bro నాని.. నీ అద్భుతమైన ప్రదర్శనతో బంతి బౌండరీలు దాటింది. అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఈ సినిమాలో నీ నటనను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా నన్ను రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ ఎక్కించింది. ఇంతటి అద్భుతమైన కథ రాసుకుని, చక్కగా తెరకెక్కించినందుకు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరికి హ్యాట్సాఫ్‌. గౌతమ్‌ విజన్‌ను అర్థంచేసుకుని, ఆయనకు మద్దతిచ్చినందుకు చిత్రబృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు ఎన్టీఆర్.

తారక్‌తో పాటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌, సుధీర్‌బాబు, మంచు మనోజ్‌, గాయకుడు కాల భైరవ తదితరులు కూడా ‘జెర్సీ’ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్లు వేసారు.

* ‘జెర్సీ సినిమాను అందరూ సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ సినిమా నాతోనే ఉండిపోతుంది. నాని నటన చాలా నచ్చింది’- సుధీర్‌బాబు

* ‘కంగ్రాట్స్‌ నాని, గౌతమ్‌ తిన్ననూరి. అందమైన, భావోద్వేగాలతో నిండిన చిత్రం. ‘జెర్సీ’ చిత్రబృందానికి ఛీర్స్‌. తప్పకుండా చూడాల్సిన చిత్రం’- మంచు మనోజ్‌

* ‘జెర్సీ సినిమా గురించి మంచి టాక్‌ వస్తోంది. నాని ఈ ప్రశంసలకు అర్హుడే. దర్శకుడు గౌతమ్‌కు కంగ్రాట్స్‌’- హరీశ్‌ శంకర్‌.