సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వాళ్లని వెంబడించే వాళ్లు తప్పనిసరి. ఎవరూ లేరనుకుంటారు…కానీ వాళ్లని ఎవరో ఒకరు వెంటాడుతూనే ఉంటారు. ఫలానా స్పాట్ లో ఉన్నాడని సరదగా క్లిక్ మనిపించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. సెలబ్రిటీలను ఈ తరహాలా వెంటాడటం రేర్ గా జరుగుతుంది. ఇక పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపై అవసరాన్ని బట్టి ఆర్గనైజేషన్స్ కొన్ని కొన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. ఎయిర్ పోర్ట్… స్టార్ హోటల్స్….పబ్ లు ఇలా కొన్ని వ్యక్తిగతంగా సెలబ్రిటీ గ్యాలరీ కోసం ఏర్పాటు ఫోటో గ్రాఫర్లను ఏర్పాటు చేస్తుంటారని తాజాగా తెలిసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ యాడ్ నిమిత్తం ముంబై వెళ్లారు. యాడ్ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణం అనంతరం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ అయి బయటకు వచ్చే సమయంలో ఓ ఫోటో గ్రాఫర్ తారక్ ఫోటోలు తీస్తున్నాడు. దీంతో తారక్ ఒకింత అసహనాకి గురయ్యాడు. ఆ కుర్రాడిని దగ్గరపిలించి భుజం మీద చేయివేసి నీకేం పనిలేదా. ఎప్పుడు ఇక్కడే ఉంటావా? భోజనం….స్నానం పడుకోవడం ఇక్కడేనా? నీకంటూ ఇల్లు లేదా? అని ప్రశ్నించాడు.
వాటి అన్నింటికి ఆ కుర్రాడు అవుననే బధులిచ్చాడు. ఇది అతని ప్రఫెషన్. ఆ ఎయిర్ పోర్ట్ లో ఏ సెలబ్రిటీ ల్యాండ్ అయిన ఫోటోలు తీయడం అతని పని. ఎయిర్ పోర్ట్ నిర్వాహకులే అతన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇది ఎంతో గొప్ప సేవ. ఎప్పటికప్పుడు అభిమానులు తమ అభిమాన హీరో ఫోటోలను చూడగల్గుతున్నారంటే ఇలాంటి వాళ్లే కారకులు. ఈ కొత్త పిక్ లో కూడా తారక్ నెత్తికి క్యాప్ ధరించి ఉన్నాడు.