తార‌క్ ఫ్యాన్స్ రేప్ చేసి చంపేస్తామ‌ని బెదిరించారు

ఒక్కోసారి సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌ విశృంఖ‌ల పోక‌డ‌లు పెచ్చుమీరి ప్ర‌వ‌ర్తించ‌డం చూస్తున్న‌దే. త‌మ ఫేవ‌రెట్ హీరోని ఎవ‌రైనా ఏదైనా అంటే స‌హించ‌లేరు. నోటికి వ‌చ్చిన‌ట్టు తిట్టేస్తూ బూతు ప‌దాల‌తో రెచ్చిపోతుంటారు. అలాంటి స‌న్నివేశ‌మే ఎదురైంది. బంగారం ఫేం మీరా చోప్రాకి.

ఈ భామ త‌న ఫేవ‌రెట్ స్టార్ మ‌హేష్ అని చెప్పి .. ప‌వ‌న్ క‌ల్యాణ్ గొప్ప మాన‌వ‌తావాది అని సూప‌ర్ స్టార్ అని పొగిడేసింది. ఇదే చిట్ చాట్ లో అస‌లు ఎన్టీఆర్ ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని కామెంట్ చేసింది. ఇంకేం ఉంది తార‌క్ అభిమానులు లైన్ లోకి వ‌చ్చి ర‌క‌ర‌కాలుగా దూష‌ణ‌లు చేశారు.

కొంద‌రు రేప్ చేస్తామ‌ని హెచ్చ‌రిస్తే.. మ‌రికొంద‌రు చంపేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు!! దుర్భాష‌లు ఆడారు!!! అంటూ మీరా చోప్రా స్వ‌యంగా సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు స్క్రీన్ షాట్లు షేర్ చేయ‌డంతో ర‌చ్చ‌వుతోంది. ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకుని వారి సోష‌ల్ మీడియా ఖాతాల్ని తొల‌గించాల‌ని డిమాండ్ చేసింది. ఇక ఇలాంటి అభిమానులు ఉంటే స‌క్సెసెలా అవుతారు? అంటూ తార‌క్ ని ప్ర‌శ్నించింది. అయితే అంత పెద్ద స్టార్ అయిన ఎన్టీఆర్ నిజంగానే మీరాకి తెలీదా? కావాల‌నే కొరివితో గోక్కోవాల‌ని అలా నాట‌క‌మాడుతోందా? అంటూ కొంద‌రు అభిమానులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో తార‌క్ ఫ్యాన్స్ రెచ్చిపోయి అస‌భ్య ప‌ద‌జాలంతో మీరాని తిట్టేశారు. వాన, బంగారం త‌దిత‌ర చిత్రాల్లో మీరా చోప్రా న‌టించింది. అటుపై ప‌లు వివాదాల్లో ఇరుక్కుని ఈ అమ్మ‌డు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే.