కాలి పీలీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని గెలుక్కున్నట్లు అయ్యిందే

(సూర్యం)

*రీసెంట్ గా వచ్చిన ‘గీత గోవిందం’  తో  సూపర్ హిట్ కొట్టిన  విజయ్ దేవరకొండ వచ్చే దసరాకి మరో చిత్రం ‘నోటా’ ని రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్ అక్టోబర్ 4న రిలీజ్ అని చాలా రోజుల క్రితమే మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే హఠాత్తుగా   విజయ్ ట్విట్టర్లో ఓ పోల్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.*

* ‘నోటా’ రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాం. అక్టోబర్ 5, అక్టోబర్ 10, అక్టోబర్ 18 వీటిలో ఏదొకటి అర్జంటుగా చెప్పండి అంటూ ఫ్యాన్స్ ను కోరాడు. అంతవరకూ బాగానే ఉంది..కానీ ఆప్షన్ లలో అక్టోబర్ 10 ఒకటి కావటం ఎన్టీఆర్  ఫ్యాన్స్ కు పిచ్చ కోపం  తెప్పించింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రంగంలోకి దిగి రచ్చ చేయటం మొదలెట్టారు. వార్నింగ్ లు ఇవ్వటం మొదలెట్టారు.*

* `నోటా` చిత్రాన్ని `అరవింద సమేత`కు పోటీగా రిలీజ్ వారు అంటున్నారు. అలా రిలీజ్ చేస్తే `నోటా` బాక్సాఫీస్ వార్ లో కనపడకుండా లేకుండా పోతుందని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఎన్టీఆర్ సునామీ ముందు ఇంకేదీ నిలవదని ,పోటీ వద్దు బ్రదర్ అంటూ పెద్ద ఎత్తున పోస్ట్ లు పెట్టడం మొదలెట్టారు. నీకు ఎన్టీఆర్ సినిమాకు పోటీ వెళ్లేటంత దమ్ముందా అంటూ మరికొందరు ఇంకెంచెం స్పీడు అవుతున్నారు. మరి చివరకు దేవరకొండ ఏ నిర్ణయానికి వస్తాడో చూడాలి. *