సెకండ్ పార్ట్ లోనే  సెన్సేషన్ సీన్స్ ..అప్పటిదే ఈ లుక్

బాబాయ్ బాలకృష్ణతో కలిసి అబ్బాయి నందమూరి కళ్యాణ్ రామ్ …‘యన్‌.టి.ఆర్‌’లో చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావుగా..బాలయ్య, హరికృష్ణగా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. వీరిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలకు సినిమాలో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా రామారావు..రాజకీయ జీవితంలో ప్రవేశించాక…చైతన్య రథ సారథిగా హరికృష్ణ కీలకైమైన పాత్రను పోషించారు. దాంతో ఈ చిత్రం సెకండ్ పార్ట్ ‘మహానాయకుడు’ లో వీరి సన్నివేశాలు హైలెట్ గా ఉండనున్నాయి.

ఇప్పటికే ఈ సీన్స్ తీసినట్లు సమాచారం. బాబాయ్, అబ్బాయిలు ఇద్దరూ పోటా పోటీగా చేసినట్లు యూనిట్ సభ్యుల టాక్.సినిమాలో ఈ సీన్స్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఉన్న లుక్ ని దసరా సందర్బంగా విడుదల చేసారు.

‘విజయం మీది.. విజయరథ సారథ్యం నాది.. నీడలా వెన్నంటి ఉంటా నాన్నగారూ..’ అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ‘అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.. నాన్న పాత్రను పోషించడం గర్వంగా, భావోద్వేగంగా ఉంది’ అని ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌ చేసిన ట్వీట్‌ ని అభిమానులు షేర్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకంగా విద్యాబాలన్‌ కనిపించనుంది. చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్‌ కనిపించనున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు.