ఇద్దరే.. ఇద్దరూ?!
టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టి ఆ ఇద్దరు హీరోలపైనే ఉంది. యాక్టింగ్ పరంగానే కాదు.. వర్కవుట్ విషయంలోనూ రాజీపడేలా లేరు! ఇంతకీ.. ఎవరా ఇద్దరూ? అనేగా మీ డౌట్? అక్కడికే వద్దాం.. ఆ ఇద్దరూ ఎన్టీఆర్- రామ్ చరణ్ ! ఏంటీ? అసలు విషయం అంటారా?
ఎస్.ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలు అన్న విషయం అందరికీ తెలిసిందే! డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో స్వాతంత్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు.
ఈ సినిమా కోసం వీరిద్దరూ కష్టపడుతున్న తీరు యూనిట్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుందట. తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి, ఆయా పాత్రలు తమ కెరీర్ లో నిలిచిపోయేలా ఉండేందుకు ఎన్నో కసరత్తులు చేస్తున్నారట! అందు కోసం ఫిట్ గా ఉండడానికి జిమ్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరిశ్రమ ఫలించి “ఆర్ఆర్ఆర్” సినిమా వీరి కెరీర్ లో గొప్పగా నిలిచి పోవాలని కోరుకుందాం!