నిర్ఘాంతపరిచే నిజాలు: ‘నోటా’ ఎంతలో తీసారు..నష్టం ఎంత?

విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ సినిమా క్రిందటి వారం విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజైన రోజు నుంచి ఈ సినిమాకు అన్నివర్గాల నుంచి నెగిటివ్ రెస్పాన్స్  వచ్చింది. ఈ నేపథ్యంలో  అసలు ’నోటా’ సినిమాపై ఎంత పెట్టుబడి పెట్టారు…ఎంత నష్టపోయారు అనే విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఓ ఆంగ్ల దినపత్రిక ఓ అడుగు ముందుకు వేసి డిస్ట్రిబ్యూటర్ విశ్వేశ్వరరావు ని కలిసి అడిగింది. దానికి ఆయన చెప్పిన విషయాలు అందరినీ షాక్ ఇస్తున్నాయి.

ఆయ చెప్పిన దాని ప్రకారం ‘నోటా’ని  కేవ‌లం 12కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. అనంతరం ప‌బ్లిసిటీ కు ఇంకో  4కోట్లు  ఖ‌ర్చ‌ు పెట్టారు. అయితే రిలీజ్ ముందు గీతా గోవిందం సూపర్ హిట్ అవటం… దేవ‌ర‌కొండ వ‌రుస స‌క్సెస్‌ల ట్రాక్ రికార్డు చూసి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి భారీగా ఆఫ‌ర్ వచ్చాయి.

ఏపీ – 12కోట్లు, నైజాం -4కోట్లు, సీడెడ్ – 2కోట్లు చెల్లిస్తామ‌న్నారు. కానీ నిర్మాత జ్ఞాన‌వేల్ త‌నే సొంతంగా రిలీజ్ చేసుకోవాల‌నుకుని డిసైడ్
అయ్యి..ఎక్కువ రేట్లు చెప్పారు. చివరకు ఏషియన్ పిక్చర్స్ సునీల్ నారంగ్, యు.వి.క్రియేషన్స్ సహాయం తీసుకుని సొంతంగా రిలీజ్ చేసి త‌ప్పు చేశార‌ని  విశ్వేశ్వ‌ర‌రావు చెప్పుకొచ్చారు. 18 కోట్ల ప్రీ బిజినెస్ ఆఫ‌ర్‌ని వ‌దులుకుని ఇప్పుడు కోట్ల‌లో న‌ష్టం కొని తెచ్చుకుంటున్నారు.  అలాగే..అక్టోబ‌ర్ 11న అర‌వింద స‌మేత రిలీజైతే త‌ర్వాత ‘నోటా’ చూసేవాళ్లు ఉండ‌నే ఉండ‌ర‌ని అన్నారు.

నోటా సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్యామ్ సీఎస్ సంగీతం సమాకూర్చారు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మెహ్రీన్ ఫిర్జాదా నటించింది. ఇక నాజర్, ప్రియదర్శి, సత్యరాజ్ లు సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేజీ జ్ఞానవేల్ రాజా నోటా సినిమాను నిర్మించారు.