అక్కడ డబ్బులు అడుక్కునే పని ఉండదు !

రాధికా ఆప్టే ఈ భామ తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషేదైనా సరే తన నటనతో అందరినీ కట్టిపడేస్తుంది. తాజాగా ‘లిబర్టీ..ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. రాధికా ఆప్టే బాలీవుడ్ (భారత్), హాలీవుడ్ (విదేశాలు) చిత్రపరిశ్రమల్లో పనిచేయడానికి మధ్య ఉన్న తేడాపై మీడియాతో చేసిన చిట్ చాట్ లో వెల్లడించింది . హాలీవుడ్ లో జనాలు క్రమశిక్షణ, నిబద్దతతో ఉంటారు. అంతేకాదు వాళ్లు సరైన టైంలో డబ్బులు ఇస్తారు. మన పని కోసం వాళ్లను అడుక్కునే అవసరం ఉండదు. ఇండియాలోలాగా హాలీవుడ్ లో పనిచేసే నటీనటులకు డబ్బు కోసం అడుక్కునే అవసరం రాదని చెప్పుకొచ్చింది.