తెలుగు ఇండస్ట్రీపై ఆగ్రహించిన హీరోయిన్ తాప్సీ.. ఏకంగా ఆ వ్యాఖ్యలు చేస్తూ!

తాప్సీ ఒక భారతీయ నటి. ఈమె హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ఈమె 1987లో న్యూఢిల్లీలో జన్మించింది. మొదట తన కెరీర్ ను మోడలింగ్ ద్వారా మొదలుపెట్టి 2010లో విడుదలైన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత 2011లో తమిళ చిత్రం ఆడుకళమ్ లో నటించింది. 2013లో చస్మే బద్దూర్ సినిమా ద్వారా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇలా తనదైన శైలిలో నటిస్తూ పాత్రకు న్యాయం చేస్తున్నానని ఆయన అవకాశాలు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీపై సంచల కామెంట్స్ చేసింది.

తాను చదువుకుంటూ మోడలింగ్లో అడుగు పెట్టానని, క్యాట్ ఎగ్జామ్స్ లో 88% మార్కులు సాధించాలని ఆ సమయంలో సినిమా అవకాశాలు వస్తే పాకెట్ మనీ కోసం సరదాగా నటిస్తున్నానని పేర్కొంది. తెలుగులో ఈమె నటించిన మూడు సినిమాలు పరాజయం కావడంతో ఐరన్ లెగ్ అని పేరు పడింది.

నా పాత్రకు నేను న్యాయం చేశాను సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణం నేనేలా అవుతాను అయినా ఇలాంటి పదాలు తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే వినపడతాయని ఇతర ఇండస్ట్రీలలో ఇటువంటివి వినిపించవు అని చెప్పింది. హీరోయిన్లకు గ్లామర్ పరంగా మాత్రమే చూస్తారని సన్నివేశపరంగా అవకాశాలు ఇవ్వరని స్ట్రైట్ గా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక హిందీలో బేబీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మొదటి విజయంతోనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా రాధిక ఆప్టే ఇలాంటి కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాలలో హీరోలకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది హీరోయిన్లకు గ్లామర్ గా చూపించి, తక్కువ సన్నివేశాలు ఉంటాయని పేర్కొంది.

అయితే రాధిక ఆప్టే బాటలోనే తాప్సీ కూడా కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు దృష్టి పెట్టి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది.