రాధిక ఆప్టే సినీ ఇండస్ట్రీ పై సంచలన కామెంట్స్.. న్యూస్ వైరల్!

రాధిక ఆప్టే ఒక భారతీయ నటి. 1985 లో మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది. ఈమె తండ్రి మహారాష్ట్ర అంతట పేరు ఉన్న నరాల వైద్యుడు. ఈమె తల్లి మత్తుమందు వైద్య నిపుణురాలు. ఈమెకు ఇద్దరూ తమ్ముళ్లు ఉన్నారు. స్వతహాగా మరాఠీ అయినా రాధిక తెలుగు, హిందీ భాషలలో నటించింది.

ఈవిడ లండన్ లో నృత్యం నేర్చుకొని రంగస్థలం మీద నటిస్తూ ఇటు మరాఠీ రంగానికి, అటు హిందీ రంగానికి చేరువైంది. సినిమాలలోకి రాకముందే 2002లో హిందీ, మరాఠీ, ఇంగ్లీషులలో ప్రయోగాత్మక నాటకాలలో నటించింది. పూణేలోని బాల గంధర్వ లాంటి ప్రసిద్ధ వేదికలపై ప్రదర్శన ఇచ్చింది.

ఈవిడ నటన చూసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహాయకులు ఎవరో చెబితే ఆడిషన్ చేసి 2010లో విడుదలైన రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగులో అగ్ర హీరో బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో నటించింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి చిత్రంలో నటించినది.

తక్కువ చిత్రాలే నటించినప్పటికీ అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తాజాగా ఈమె గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో కొనసాగాలన్న, అవకాశాలు రావాలన్న దర్శక,నిర్మాతలకు పడక సుఖం అందించాలని లేకపోతే రాణించడం కష్టం అని ఆమధ్య ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చేరిపోయాయి.

అయితే దీని గురించి ఆ నిర్మాత లేదా ఆ దర్శకుడు ఎవరో చెప్పాలని లేకపోతే అది అందరూ దర్శక నిర్మాతలపై చెడు అభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని కొందరు ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మొత్తానికి ఎందుకు ఈ కామెంట్ చేసిందో, అసలు నిజం మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు.