శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ సినిమా ఇదే

‘ఛలో’ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు నితిన్. ఇదే జోరుతో ప్రస్తుతం ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో మూవీ రానుందని ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. భీష్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం.

ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న డైరెక్టర్ వెంకీ ఆగష్టు మొదటివారంలోనే షూటింగ్ ప్రారంభించటానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అట. ‘సింగిల్ ఫర్ ఎవర్’ అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించారట ఈ మూవీకి. ‘ఇష్క్’ మూవీతో మంచి లవర్ బాయ్ ఇమేజ్ ని దక్కించుకున్నాడు నితిన్. అప్పటి నుండి తను చేసే సినిమాలన్నీ అదే తరహాలో ఉంటున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్లు బానే వస్తున్నాయి. లవ్ ఫార్ములా నితిన్ కి బాగా కలిసొచ్చిందనుకుంట.