ఆ విషయంలో భార్యతో యాంకర్ రవికి విబేధాలు!!

Anchor Ravi Nuvvu Ready Nenu Ready Success Celebration

బుల్లితెరపై యాంకర్ రవికి ఉండే ఫాలోయింగ్ అందులోనూ మరీ ముఖ్యంగా అతనికి ఉండే మహిళల్లో ఉండే ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అమ్మాయిలకు ఇష్టమైన యాంకర్‌గా బుల్లితెరపై ఫుల్ పాపులార్టీ సంపాదించుకున్నాడు.లాస్య, శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ, భాను శ్రీ ఇలా అందరితో కెమిస్ట్రీ నడిపించి షోలను హిట్ చేయిస్తాడు. నాటి సమ్‌‌థింగ్ స్పెషల్ నుంచి నేటి అదిరిందో షో వరకు యాంకర్ రవి అదే ఫాలో అవుతున్నాడు.

Anchor Ravi
Anchor Ravi

బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌తో వెండితెరపై హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అది అంతగా వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ బుల్లితెరపైనే శ్రద్ద పెట్టాడు. ఇక ప్రస్తుతం అదిరింది షోతో బాగానే బిజీ అయ్యాడు. యాంకర్ రవి పెళ్లి విషయమై అప్పట్లో రేగిన వివాదాలు అంతా ఇంతా కాదు. పెళ్లి అయినా ఆ విషయం చెప్పకుండా దాచి పెడుతున్నాడని అందరూ టార్గెట్ చేయడంతో ఓ రోజు భార్య, పాప ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చాడు.

Nuvvu ready Nenu Ready
Nuvvu ready Nenu Ready

యాంకర్ రవి తన భార్య నిత్యల లవ్ స్టోరీ, కూతరు వియాపై ఉన్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా చెప్పాడు. ఇక తాజాగా రవి మరో యాంకర్ వింధ్యతో కలిసి ఓ కొత్త షోను హోస్ట్ చేయబోతోన్నారు. నువ్వు రెడీ నేను రెడీ అనే ఈ షోను భార్యాభర్తలపై డిజైన్ చేశారు. ఈ షోపై రవి భార్య నిత్య కామెంట్స్ చేస్తూ… హలో మిస్టర్ హబ్బి..మీరు ఎంత ప్రయత్నించినా.. భార్యలే చివరకు గెలుస్తారు.. వింధ్య నీకు మద్దతుగా నేను ఉంటాను.. అని చెప్పుకొచ్చింది. ఇక దీనికి రవి స్పందిస్తూ..హా హా హా భర్తలే గొప్పవారు అంటూ ఓ నవ్వు నవ్వేశాడు. భార్య గొప్పదా? భర్త గొప్పోడా? అని వీరిద్దరు కూడా ఆ షోలో మాదిరిగానే ఇంట్లో కూడా పోట్లాడుకుంటారేమో ఏమో మరి. భార్య, భర్త విషయాల్లో ఈ ఇద్దరి అభిప్రాయాలు ఇలా భిన్నంగా ఉన్నాయన్న మాట.