అప్పుడే షూట్ అంటోన్న  కొత్త పెళ్లి కొడుకు !

హీరో నితిన్ రీసెంట్ గా పెళ్ళితో బ్యాచరల్ లైఫ్ కి శుభం కార్డ్ వేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల్ని కూడా ఇప్పటికే వరుసగా ఒప్పుకున్నాడు. లాక్ డౌన్ ముందువరకూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే చిత్రం చేశాడు. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో చిత్రం చేసే ప్లాన్ లో ఉన్నాడు. అన్నట్టు ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అందుకే ఆ టైటిల్ పెడుతున్నారని తెలుస్తోంది. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. నితిన్ మొత్తానికి నాలుగు నెలలు కూడా గ్యాప్ తీసుకునేలా లేడు.

ఇక యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి. ఈ సినిమా కూడా మిస్టరీ నేపథ్యంలోనే ఉంటుందట. కాగా నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ’ భారి స్థాయిలో ఆకట్టుకోని సూపర్ హిట్ అయింది. దాంతో నితిన్, ఆ సక్సెస్ ను కొనసాగించాడానికి తన తదుపరి సినిమాల పై మరింత దృష్టి పెట్టాడు. కథాకథనాల్లో మ్యాటర్ ఉంటేనే సినిమాకి ఓకే చెబుతున్నాడు. మరి ఈ ‘చదరంగం’ చిత్రంతో కూడా నితిన్ మరో సూపర్ హిట్ ఆయనకు దక్కుతుందేమో చూడాలి.

అలాగే ఈ సినిమా కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ నితిన్ ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు. ఇక నితిన్ కొద్దిరోజుల క్రితం తన చిరకాల ప్రేయసి శాలినిని వివాహం చేసుకున్నారు. మొదట నితిన్ దుబాయ్‌ లో ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాలనుకున్నా… క‌రోనా కారణంగా అది కుదరక సన్నిహితుల మధ్యే సాదారణంగా తన పెళ్లి తంతును ముగించాడు.