టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నితిన్ తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా నితిన్ వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయాలకు సంబంధించిన కులాలను కించపరుస్తూ… బూతులు తిడుతున్నట్టుగా… ప్రస్తుతం ఉన్న అధికార పక్ష కులాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి అకౌంట్ ద్వారా ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఇటీవల ఆ పోస్టల్ గురించి రాజశేఖర్ రెడ్డి వివరణ ఇస్తూ.. స్వతహాగా నేను జగన్మోహన్ రెడ్డికి అభిమానిని. జగన్మోహన్ రెడ్డి గెలిచిన రోజు నా అభిమానాన్ని తెలియజేశాను తప్పితే ఇప్పటివరకు ఇతర కులాల వారిని కించపరిచి మాట్లాడలేదు. నేను ఒక్క ట్వీట్ కూడా డిలీట్ చేయలేదు ఇకపై చేయను కూడా అంటూ రాసుకు వచ్చారు
ఇక ఈ విషయం గురించి హీరో నితిన్ స్పందిస్తూ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాత పోస్ట్ లను జోడించి ట్వీట్ చేశారు. ఒక నకిలీ వ్యక్తి ఫేక్ అకౌంట్ ద్వారా చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన రచ్చ క్రియేట్ చేస్తోంది.
ఇలా చేసిన పోస్ట్ లు ఇతరుల మనోభావాలను కూడా దెబ్బతీశాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికి ఆంధ్రలో టికెట్ల ధరల విషయంలో సినిమా వాళ్లకి,ప్రభుత్వానికి మద్య గతంలో రచ్చ జరిగింది