నితిన్ పాటకి మహేష్ బాబు డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట విడుదలై మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల మహేష్ బాబుకి సంబంధించిన ఒక డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మహేష్ బాబు యంగ్ టాలెంటెడ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాలోని ‘రాను రానంటూనే చిన్నదో ‘ అనే పాటకు స్టెప్పులేసాడు. అయితే నిజంగా మహేష్ బాబు ఈ పాటకి డాన్స్ చేసాడనుకుంటే పొరపాటు పడినట్టే.

అసలు విషయానికి వస్తే… మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని మ.. మ.. మ మహేషా అనే పాటలో మహేష్, కీర్తి వేసే మాస్ స్టెప్స్‏కు మహేష్ అభిమానులు జయం పాటను ఎడిట్ చేశారు . ఈ ఎడిట్ చేసిన పాటకు మహేష్, కీర్తి వేసే స్టెప్స్ చాలా కరెక్ట్‏గా సెట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవల ఈ వీడియో పై హీరో నితిన్ స్పందించాడు. ఈ డాన్స్ వీడియో చూసిన నితిన్ రీట్వీట్ చేస్తూ.. వావ్.. సూపర్.. పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం నితిన్ ఎం రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా మీద ప్రేక్షకుల అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన స్పెషల్ సాంగ్ రా.. రా.. రెడ్డి.. ఐయామ్ రెడీ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ పాటలో హీరోయిన్ అంజలి నితిన్‏తో స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ పాటకి యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్‏లో నితిన్ తన మొదటి సినిమా జయం సినిమాలోని రాను రాను అంటుంది చిన్నది పాటకు కృతి శెట్టి, అంజలితో కలిసి నితిన్ స్టేజ్ పైనే పాటకు డాన్స్ చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు పాటకి ఈ పాటని ఎడిట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.