ఇండస్ట్రీ టాక్ : అప్పుడే వచ్చే ఏడాదికి పవన్ మరో హిట్ సినిమా రీ రిలీజ్ కి ప్లాన్స్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఎన్నో హిట్ సినిమాలు తన కెరీర్ ఆరంభంలోనే వచ్చేసాయి. అలా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ “ఖుషి” వరకు పవన్ తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూస్కో లేదు. అయితే ఆ సినిమా నమోదు చేసిన రికార్డు లు వసూళ్లు అంతా ఇంతా కూడా కాదు.

అయితే ఈ ఏడాది పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమానే రీ రిలీజ్ చెయ్యాల్సి ఉంది కానీ జల్సా ఈ రేస్ లోకి వచ్చింది. దీని తోనే ఆల్ టైం రికార్డు వసూళ్లు నమోదు చేయగా మరి ఈ ఖుషి సినిమాని అయితే వచ్చే ఏడాదిలో రిలీజ్ కి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి ఈ విషయాన్ని సినిమా నిర్మాత ఏ ఎం రత్నం తెలిపినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది పవన్ పుట్టినరోజుకి గాను ఈ ఖుషి సినిమా 4కే లో రిలీజ్ ఉంటుంది. దీనితో ఈ సినిమా షోస్ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయాయని చెప్పాలి.

మరి ఈ సినిమాకి అయితే ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయో చూడాలి. ఇంకా ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించగా మణిశర్మ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఆల్బమ్ అందించగా తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాని దర్శకత్వం వహించారు.