బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు..ఎన్నో ఆరోపణలు..మరెన్నో ట్విస్టులు. వీటిలో ఏది నిజం? ఎవరు నిజం? ఏది అబద్దం? ఎవరు అబద్దం? అన్నది తెలియదు గానీ సుషాంత్ మరణానంతరం పోలీసులు విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సుషాంత్ ఆత్మహత్యపై ఇప్పటికే నెపోటిజం అనే కారణంగా బలంగా వినిపిస్తోన్న ఆయన ప్రేమ వ్యవహారాలు కూడా ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే సుషాంత్ గతంలో ప్రేమ వ్యవహారాలు నెరిపిన ప్రియురాళ్లు అందర్నీ పోలీసులు విచారించడం జరిగింది. వాళ్ల దగ్గర నుంచి అన్ని రకాల వివరాలు సేకరించారు.
ఇక సుషాంత్ కు మానసిక వైద్యం అందించిన డాక్టర్ కేసరి చావ్డా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారాలే కారణంగా చెప్పుకొచ్చారు. సుషాంత్ ప్రియురాలిలో ఒకరైనా రియా చక్రవర్తిని పోలీసు విచారించిన నేపథ్యంలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే రియా పోలీసుల ప్రశ్నలకి ఏ మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పడం కోసమెరుపు. సుషాంత్ ఇంట్లో దెయ్యాలున్నాయని కేసును తప్పు దారి పట్టించే ప్రయత్నం చేసింది. అతనితో కలిసి ఉన్నప్పుడు ఇంట్లో వింత శబ్ధాలు..అలికిడి జరిగేదని తెలిపింది. అలాగే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో కాంట్రాక్టులు రద్దు చేసుకున్నాడని, ఆ బ్యానర్‌లో తనని కూడా సినిమాలు చేయవద్దని హెచ్చరించినట్లు తెలిపింది.
డాక్టర్ కేసరి ని విచారిస్తోన్న సమయంలో రియా ఇబ్బంది పెట్టినట్లుగాను చెప్పుకొచ్చారు. అలాగే రియా చక్రవర్తి దర్శక, నిర్మాత మహేష్ భట్ తో ఏఫైర్ నెరపడం…ఇద్దరు కలిసి సుషాంత్ ని మానసికంగా ఇబ్బందికి గురిచేసినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు నేపథ్యంలో పోలీసులు ఆ రకంగాను కావాల్సినంత సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. రియా ఓ పక్క సుషాంత్ తో ప్రేమాయణం సాగిస్తూనే సినిమా అవకాశాల కోసం మహేష్ భట్ తో రియా అక్రమ సంబంధం నెరిపేదని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాలు సుషాంత్ తెలిసితట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం చూస్తుంటే చాలా దూరం వెళ్లేలా ఉంది. సుషాంత్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారాలే అసలు కారణాలుగా బలంగా వినిపిస్తోంది.