మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి అల.. వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ వద్ద నెవర్ బిఫోర్ అనే హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయడానికి ఒప్పుకోగా లాక్ డౌన్ కాస్త దెబ్బేసింది. పైగా ఎన్టీఆర్ కు RRR పనులు ఎక్కువయ్యాయి. చూస్తుంటే రాజమౌళి ఇప్పట్లో వదిలేలా లేడని అనిపిస్తోంది. 400కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి తారక్ కూడా ఆ సినిమా అయిపోయిన తరువాతనే మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అందుకే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.
అసలు మ్యాటర్ ఏమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆల్ రెడీ కథ సెట్ చేసుకున్న మాటల మాంత్రికుడు టైటిల్ విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ అండ్ పొలిటికల్ డ్రామాగా సినిమాను తెరకెక్కించనున్న త్రివిక్రమ్ మొదట “అయినను పోయిరావలే హస్తినకు” అనే టైటిల్ ను అనుకున్నట్లు టాక్ వచ్చింది. చిత్ర యూనిట్ ఆ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినప్పటికి అబద్ధమని మాత్రం చెప్పలేదు. కానీ ఇటీవల మరో కొత్త తరహా ఆలోచబతో “రాజ వచ్చినాడు” అనే క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా రూమర్స్ వస్తున్నాయి.
టైటిల్ గురించి ఎన్టీఆర్ కు కూడా వివరణ ఇవ్వగా పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. సినిమాలో ఢిల్లీ బ్యాక్ గ్రౌండ్ లో నేషనల్ పొలిటికల్ కి సంబంధించిన అంశాలు చాలానే ఉంటాయట. తారక్ రెండు విభిన్నమైన షేడ్స్ తో కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. ప్రస్తుతం RRR సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమాను సమ్మర్ లోపు ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ ఏమో 2021 జనవరిలోనే సినిమాను లాంచ్ చేసి షూటింగ్ ప్లాన్ కూడా రెడీ చేసుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఈ కాంబో లో వచ్చే సెకండ్ మూవీ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.