‘ఆ ఆరుగురు నా తలరాతను తలకిందులుగా రాశారు’

వెరైటీ కథలతో సౌత్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. యూత్ లో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న ఆమె సినిమాలు హీరోల చిత్రాలకు పోటీగా ఆమె చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ రాబడుతున్నాయి. తాజాగా ఈ ‘లేడీ సూపర్‌స్టార్‌’ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘ఐరా’. సర్జున్‌ కేఎమ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో… కలైయరసన్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ సెన్సేషన్ గా మారింది. ఇందులో నయనతార గుర్తు పట్టలేని విధంగా కొత్త లుక్‌లో కనిపించింది.

చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘గ్రహణం’ ఫేమ్‌ సుందరమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. మీరు ఈ టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

Airaa Official Teaser - Telugu | Nayanthara, Kalaiyarasan | Sarjun KM | Sundaramurthy KS

‘మళ్లీ ఆడపిల్ల పుట్టింది రా.. అయ్యో ఆడపిల్లా..!’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘నాకే తెలియని ఎవరో ఆరుగురు నా తలరాతను తలకిందులుగా రాశారు..’ అంటూ నయన్‌ ఆవేదన వ్యక్తం చేస్తూండంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఆమె ఓ పాత్రలో మోడ్రన్‌గా, ధైర్యంగా.. మరో పాత్రలో చాలా అమాయకంగా కనిపించారు. ‘అందరికీ సంతోషంగా బతకడం ఒక కళ.. కానీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియని నాకు బతకడమే ఒక కళ’ అనే డైలాగ్‌తో టీజర్‌ ముగిసింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా హారర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అర్దమవుతోంది.

రీసెంట్‌గా కొల‌మావు కోకిల అనే చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన న‌య‌న‌తార ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న సైరా చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది. అజిత్ విశ్వాసం, శివ‌కార్తికేయ‌న్ చిత్రం, నివీన్ పాలి ల‌వ్ యాక్ష‌న్ డ్రామా సినిమాల్లోనూ ను న‌య‌న‌తార కనిపించనుంది.