దటీజ్ నయనతార!

Nayanathara

దటీజ్ నయనతార!

ఎన్నో విమర్శలు, అవమానాలు, అవరోధాలను అధిగమించి అగ్రతారగా వెలిగిపోతున్న నటి నయనతార.  తొలి దశలో అందాలనే నమ్ముకుని హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ భామ అటు తర్వాత  కథానాయకి ప్రధాన పాత్రల నటిగా ఎదిగిపోయింది.

ఇప్పుడు నయనతార నటించాలంటే ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉండాల్సిందే. అలాంటి స్థాయిలో ఉన్న నయనతార చేతిలో బోలెడు అవకాశాలు ఉన్నాయట. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకులతో నటించడానికి రెండేసి చిత్రాలు అంగీకరించిందట.

ఈ విషయం గురించి నయనతారను కదిలిస్తే-  తెలుగు, తమిళ భాషల్లో రెండు చిత్రాలను అంగీకరించాను. త్వరలో ఈ సినిమాలు సెట్స్ పైకి రానున్నాయి. ఈ చిత్రాల్లో కథానాయకి ప్రధాన ఇతివృత్తంతో సాగుతాయి. ఇక ముందు కూడా నేను నటించే చిత్రాలు కథానాయకి ప్రధానంగానే ఉంటాయి అని చెప్పుకొచ్చింది. దటీజ్ నయనతార!