పది కోట్లు ఆఫర్ రిజెక్ట్ చేసిన నయనతార !

Nayanathara

సెన్సేషన్ అవుతున్న నయనతార షాకింగ్ న్యూస్!

క్రేజీ బ్యూటీ నయనతారకు కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్ మరో హీరోయిన్‌కు లేదు. ఆ క్రేజ్‌ని నిలబెట్టుకుంటూ ఓవైపు స్టార్ హీరోలతో, మరోవైపు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియెంటెడ్‌కూ న్యాయం చేస్తోంది నయన్. తమిళంలో అర డజనుకుపైగా సినిమాల్లో నటిస్తున్నఈ బ్యూటీ తెలుగులో మెగాస్టార్‌తో సైరా చేసింది.

అయితే తాజాగా ఈ బ్యూటీకి వచ్చిన బంపర్ ఆఫర్‌ను తిరస్కరించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓ ఫ్రెష్ హీరో పక్కన హీరోయిన్‌గా ఒప్పుకుంటే దాదాపు పది కోట్ల పారితోషికం ఇస్తామంటూ నిర్మాతలు ఆమెను అప్రోచ్ అయ్యారట. సినిమాకు రెండు, మూడు కోట్లు తీసుకునే నయన్‌కు నిజంగా ఇది భారీ ఆఫరే.

అయితే ఈ అమ్మడు మాత్రం ఆ ప్రాజెక్టుకు నో చెప్పిందట. ఇదే షాకింగ్ న్యూస్. తమిళంలో కొత్త హీరో శరవణన్‌ను పరిచయం చేస్తూ సినిమా ప్లాన్ చేశారు. క్రేజీ హీరోయిన్‌ని పెట్టుకుంటే మైలేజ్ ఉంటుందని భావించిన దర్శక నిర్మాతలు నయనతారను సంప్రదించారట. ఆ హీరోతో చేయలేనంటూ నయన్ రిజెక్ట్ చేయడమే సెన్సేషన్ అవుతోంది. దటీజ్.. నయనతార!