నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లిపై సోషల్ మీడియాలో కథనాలు కొత్తేం కాదు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? లేదా? అన్నది తెలియుదుగానీ సోషల్ మీడియా మాత్రం ఆ ఇద్దరికీ చాలాసార్లు పెళ్లి చేసింది. పిల్లలు కూడా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ జంట పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. ఇద్దరు రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకోడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా అంతా ఇళ్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. షూటింగ్ లు కూడా లేవు. దీంతో ఇదే రైట్ టైమ్ గా భావించి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని స్పాట్ డెసిషీన్ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
అతికొద్ది మంది సమక్షంలో పెళ్లి నిరాడంబరంగా జరగబోతుందని కోలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. నయన్-విఘ్నేష్ కుటుంబ సభ్యులు అందకు మంచి ముహూర్తం కూడా పెట్టేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో? తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇద్దరు పెళ్లి బంధంతో ఒకటి కావడం సంతోషంగా ఉందంటూ కొన్ని పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో ఆ ఇద్దరే తేల్చాలి. ఇప్పటివరకూ నయన్ గానీ, విఘ్నేష్ గానీ దీనిపై స్పందించలేదు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన నేను రౌడీనే అనే సినిమాలో నటించేటప్పుడు ఇద్దరు ప్రేలో పడిన సంగతి తెలిసిందే.
అంతకు ముందు నయన్ శింభు, ప్రభుదేవాతో నూ ప్రేమలో పడ్డారు. ప్రభుదేవాతో పెళ్లి పీఠల వరకూ వెళ్లి వెనక్కి వచ్చింది. అప్పట్లో ఆ వార్త పెద్ద సంచలమే అయింది. అప్పటికే పెళ్లైన ప్రభుదేవ భార్యకు విడాకులిచ్చి మరీ నయన్ పెళ్లాడటానికి రెడీ అవుతున్నాడని కథనాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయనతార కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. టాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా చాలా సెలక్టివ్ గా వెళ్తోంది. మంచి కంటెంట్, స్టార్ హీరో అయితే ఒప్పుకుంటుంది. లేదంటే ఎంత పారితోషికం ఆఫర్ చేసినా నో అనేస్తోంది.