జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందా ?
భారతీయ సినిమా రంగంలో వున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా జాతీయ సినిమా అవార్డు అనుకోవాలని కలలు కంటారు . ఆ కల సాకారమైతే ఇక అది ఎప్పటికీ మధుర స్వప్నమే . అయితే 66వ జాతీయ అవార్డుల కోసం అప్లై చేసుకున్న చిత్ర నిర్మాతలు , నటి నటులు , సాంకేతిక నిపుణులు అవి ఎప్పుడు ప్రకటిస్తారా ? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు .
జాతీయ అవార్డుల ఎంపిక ప్రక్రియ మార్చి , ఏప్రిల్ మాసాల్లో జరుగుతుంది . అవార్డుల ప్రదానం మే 3వ తేదీన జరుగుతుంది . ఇది చాలా సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న విధానం . అయితే ఈ సంవత్సరం దేశంలో సార్వత్రిక ఎన్నికల జరిగిన కారణంగా మే 3న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ద్వారా ప్రదానం జరగవలసిన జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఏప్రిల్ 24న కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది . అదే రోజు రాహుల్ రవెల్ నేతృత్వం లోని కమిటీ అవార్డులను ప్రకటించాలనుకున్నారు . ప్రభుత్వ నిర్ణయంతో అది ఆగిపోయింది .
ఎన్నికలు అయిపోయాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు ఏర్పడింది . మూడు నెలల కాలం గడిచిపోయినా , అయినా జాతీయ అవార్డుల ప్రదానం గురించి కేంద్ర సమాచార శాఖ లేదా డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ కానీ దీన్ని గురించి శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించడం లేదు . ఇంతవరకు విజేతల లిస్టు కూడా ప్రకటించలేదు . ఇక అవార్డుల ప్రదానం ఎప్పుడు జరుగుతుందో ?
భారత దేశంలో అన్ని భాషల్లో నిర్మించిన సినిమాలు జాతీయ అవార్డుల పోటీకి వస్తాయి . ఈ అవార్డుల ఎంపికకు మొదట్లో ఒకే కమిటీ ఉండేది . అందువల్ల ఎక్కువ సమయం పట్టేది . నెల రోజులకు పైగా జ్యూరీ సభ్యులు అన్ని సినిమాలను చూసి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసేవారు .
అయితే క్రమంగా సినిమాల సంఖ్య బాగా పెరగడంతో కేంద్ర సమాచార శాఖ ఐదు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేసింది .
నార్తర్న్ రీజియన్ ఈస్టర్న్ రీజియన్, వెస్టర్న్ రీజియన్ , సథరన్ రీజియన్ | , సథరన్ రీజియన్ | | ఈ ఐదు కమిటీలకు నలుగురు సభ్యులు ఒక చైర్మన్ వుంటారు వీరు తమకు వచ్చిన వాటిల్లో మూడవ వంతు మాత్రమే ఎంపిక చెయ్యాలి . ఆ తరువాత ఈ ఐదు కమిటీలు ఎంపిక చేసిన సినిమాలను సెంట్రల్ జ్యూరీ చూసి ఉత్తమ సినిమాలు , నటీనటులను , సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తుంది . 65వ అవార్డుల కార్యక్రమం సందర్భంగా అప్పటి కేంద్ర సంచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ మీద విజేతలు మండిపడి .. అవార్డులు తీసుకోకుండా బాయ్ కాట్ చేశారు . అప్పుడు రాష్ట్రపతి తో 137 అవార్డులకు కేవలం 11 అవార్డులను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పించిన తరువాత వారిని పంపించి మిగతా అవార్డులను మంత్రి స్మృతి ఇరానీ ఇవ్వడం మొదలు పెట్టక విజేతలు నిరసన తెలుపుతూ బయటకు వెళ్లిపోయారు . రాష్ట్రపతి తో తీసుకోవలసిన అవార్డులను స్మృతి ద్వారా తీసుకోవడాన్ని ఎవరూ ఇష్టపలేదు
66వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా నైనా జరిగిన పొరపాటు దిద్దుకుంటారా ? అప్పటి మంత్రి స్మృతి చేసిన తప్పు తెలుసుకున్న ప్రభుత్వం ఆమెను ఆ శాఖ నుంచి తప్పించింది. ఇప్పుడు కేంద్ర సంచార శాఖ మంత్రిగా ప్రకాష్ జవదేకర్ వున్నారు . గత అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా అవార్డులన్నీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందు ద్వారా ప్రదానం చేసే అవకాశం వుంది ? అయితే ఇంతకీ ఈ అవార్డుల ప్రదానోత్సవం ఎప్పుడో ?