‘నటన’లో సీనియర్ హీరో…

శ్రీ వీరాంజనేయులు సమర్పణలో కుబేర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కుబేర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం “నటన”. నూట ఎనబై కు పైగా విజయవసంతమైన చిత్రాలకు  రైటర్ గా పని చేసిన భారతి బాబు ” నటన” చిత్రానికి తొలిసారిగా దర్శకత్వ బాధ్యతను స్వీకరిస్తున్నాడు. నా లవ్ స్టొరీ ఫెమ్  మహీదార్ హీరోగా, వానవిల్లు ఫెమ్ శ్రావ్య రావు హీరోయిన్ గా నటిస్తున్నారు. మోరల్ వాల్యూస్ ఉన్న లవ్ స్టొరీ  తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో బానుచందర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.  “నటన” ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని మొదటి కాపీ తో అతి త్వరలో ప్రేక్షకులను అలరించబోతోంది..

 

మహీదార్, శ్రావ్య రావు జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో  బానుచందర్, రఘుబాబు, ప్రభాస్ శీను, జబర్దస్త్ ఫణి, లతో పాటు  ఎందరో  సీనియర్ నటీనటులు నటించనున్నారు.. ఈ చిత్రానికి  సంగీతం: ప్రభాకర్ ప్రవీణ్ లంక, కెమెరా: వాసు, ఎడిటర్: వి. నాగేశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటేశ్వర్, నిర్మాత: కుబేర ప్రసాద్, దర్శకత్వం: భారతి బాబు.