స్టార్ నాని సిల్వర్ జూబ్లీ మూవీ వి
. నానిని హీరోగా పరిచయం చేస్తూ అష్టాచమ్మా
సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆ తర్వాత నానితో జెంటిల్‌మన్
సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం వి
. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని సిక్స్ ప్యాక్‌తో సందడి చేయబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే నాని గ్రే షేడ్ ఉన్న పాత్రను పోషించడం. సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు నార్మల్‌గానే కనపడుతూ వచ్చిన నాని తొలిసారి సిక్స్ ప్యాక్ చేయనుండటం అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.
నాని సిక్స్ ప్యాక్
