Home Tollywood "ప్రేమ కథా చిత్రం 2" హీరోయిన్ గా నందిత శ్వేత‌!

“ప్రేమ కథా చిత్రం 2” హీరోయిన్ గా నందిత శ్వేత‌!

ప్రేమ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో  ఆర్ పి ఏ క్రియేషన్స్ మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కు సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా  “ప్రేమ కథా చిత్రం 2” సినిమా మెద‌టి షెడ్యూల్ ని పూర్తిచేసుకుని… అగ‌స్ట్ మొద‌టి వారంలో భారీగా రెండ‌వ షెడ్యూల్ ని జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి ‘బ్యాక్ టూ ఫియర్’ అనేది క్యాప్షన్. ఇటీవ‌లే హ్య‌పి వెడ్డింగ్ తో డీసెంట్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్న సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా చిత్రం తో మంచి క్రేజ్ సంపాదించుకున్న నందితా శ్వేత హీరోయిన్ గా చేస్తుంది. ప్ర‌స్తుతం నందిత శ్వేత శ్రీనివాస క‌ళ్యాణం చిత్రం లో న‌టించింది.  జంబ‌ల‌కిడి పంబ చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన సిధ్ధి ఇదాని మ‌రో హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే… 

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. అలాగే జక్కన్న లాంటి సూపర్ హిట్స్ గా మా సంస్థ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రం హిలేరియస్ కామెడీ తో ట్రెండ్ క్రియేట్ చేస్తే, జ‌క్క‌న్న క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని తెచ్చింది. మా బ్యాన‌ర్ లో మూడ‌వ చిత్రం గా ఇప్పుడు ప్రేమ కథా చిత్రం 2 నిర్మిస్తున్నాం.  సుమంత్ ఆశ్విన్ హీరోగా నటిస్తున్నారు. హరి కిషన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథ ఇది. మా బ్యానర్ కి మరొక సూపర్ హిట్ చిత్రం గా నిలుస్తుందని నమ్ముతున్నాం. ఈచిత్రం లో గోల్డెన్ లెగ్ నందితా శ్వేత హీరోయిన్ గా చేస్తుంది. త‌మిళం, క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో చేసిన చిత్రాల్లో అన్ని సూప‌ర్ హిట్స్ కాగా ఇప్ప‌డు శ్రీనివాస క‌ళ్యాణం లో న‌టించింది. అలానే మ‌రో హీరోయిన్ గా సిధ్ధి ఇదాని చేస్తుంది. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి, డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్ గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఓక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్నాం, అగ‌ష్టు మెద‌టివారంలో రెండ‌వ షెడ్యూల్ ని ప్రారంభిస్తాము.. సెప్టెంబర్ వరకు జరిగే ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది.  అని అన్నారు..

 

న‌టిన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందితా శ్వేత‌, సిధ్ధి ఇదాని త‌దిత‌రులు

 

సాంకేతిక నిపుణులు : 

కెమెరామెన్ – సి. రాం ప్రసాద్, 

ఎడిటర్ – ఉద్ధవ్, 

సంగీతం – జెబి 

డైలాగ్ రైటర్ – చంద్ర శేఖర్ 

ఆర్ట్ – అశోక్

పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను 

కో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి

నిర్మాత –  ఆర్. సుదర్శన్ రెడ్డి

 

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News