తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలకు కౌంటర్

తనుశ్రీదత్తా రీసెంట్ గతంలో ఎప్పుడో జరిగిన విషయాన్ని మళ్లీ తవ్వి తీసి తనను నానా పటేకర్ అప్పట్లో లైంగికంగా వేధించారంటూ వివాదం మొదలెట్టింది. లైంగిక వేధింపులు అనే టాపిక్ అనగానే మీడియా మొత్తం ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యిపోయి తనుశ్రీ దత్తా వ్యాఖ్యలను హైలెట్ చేసేసింది. దాంతో విషయం నానా పటేకర్ దాకా వెళ్లింది.

ఓ నేషనల్ మీడియా ఆయన్ని తను శ్రీదత్తా విషయమై స్పందించమన్నారు. దానికి నానా పటేకర్ మండి పడ్డాడు. అసలు షూటింగ్ లో చుట్టూ యాభై నుంచి వందమంది ఉండగా ఆమెను నేను లైంగికంగా వేధించానా..అసలు ఏం మాట్లాడుతోందో అర్దం అవుతోందా..నేను కోర్ట్ కు వెళ్లి చట్టబద్దంగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటాను అన్నారు.

అంతేకాకుండా తన సోషల్ యాక్టివిటీస్ ని  తనుశ్రీదత్తా… తప్పు బడుతూ…చేసిన తప్పులు కవర్ చేసేందుకే సమాజ సేవ చేస్తున్నాననే విషయానికి కూడా నానా పటేకర్ కూల్ గా సమాధానమిచ్చారు. ఈ దేశంలో ఎవరికి తోటినట్లు వాళ్లు ఎదుటివారి గురించి మాట్లాడే హక్కు ఉంది. నేను మాత్రం సమాజ సేవలో సంతోషం దొరుకుతోంది అనే ఉద్దేశ్యంతోనే కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్ర రైతులకు సాయిం చేస్తున్నాను అన్నారు. మరి ఇప్పుడు తనుశ్రీదత్తా ఈ కామెంట్స్ కు ఏం కౌంటర్ ఇస్తుందో చూడాలి.