నగేష్ నారదాశి ‘శ్రీ సత్యనారాయణ స్వామి’ పౌరాణిక చిత్రంతో తన చలన చిత్ర ప్రయాణాన్ని ప్రారంభించి.. ‘నిను చూసిన క్షణాన’ చిత్రంతో ప్రేమకథా చిత్రాన్ని, ‘కిల్లర్’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ను, ‘బ్యాండ్ బాజా’ లాంటి కుటుంబ కథా చిత్రాన్ని, ‘లవ్ బూమ్’ వంటి రొమాంటిక్ చిత్రాన్ని, ‘దేశదిమ్మరి’ అంటూ యాక్షన్ చిత్రాన్ని.. ఇలా అన్ని జోనర్స్‌లో చిత్రాలు చేసిన ఆయన ఇటీవలే ‘విరాజ్’ అనే కన్నడ చిత్రంతో బిగ్ హిట్ అందుకుని శాండల్‌వుడ్‌లో కూడా తన ముద్రను వేశారు. తాజాగా ఆయన ‘రమాకాంత్’ హీరోగా ‘సముద్రుడు’ అనే టైటిల్‌తో పూర్తి సముద్రం బ్యాక్ డ్రాప్‌లో ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 14న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బడావత్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘మా దర్శకుడు నగేష్ నారదాశిగారు చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. పూర్తి సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రారంభిస్తాం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ముగించి, రెండవ షెడ్యూల్ చీరాల బీచ్ పరిసరాలలో షూటింగ్ చేసి పాటలను బ్యాంకాక్‌లో షూట్ చేస్తాము..’’ అన్నారు. మాకాంత్, మోనాల్, సిమర్, సుమన్, శ్రవణ్, ముఖ్తార్ ఖాన్, జబర్ధస్త్ శేషు, సుమన్ శెట్టి, సమ్మెట గాంధీ, గోపాలకృష్ణ, ప్రభావతి, డి.వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, సినిమాటోగ్రఫీ: వాసు, ఫైట్స్: సతీష్, పీఆర్వో: వీరబాబు, సహ నిర్మాతలు: శ్రీరామోజు జ్ఞానేశ్వర్, పి. రామారావు, సోములు, నిర్మాత: బడావత్ కిషన్, మాటలు: పార్వతీచంద్, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: నగేష్ నారదాశి.