క్షమాపణలు చెప్పిన నాగచైతన్య…కారణం కేరళ వరదలు

నాగచైతన్య క్షమాపణలు చెప్పటానికి కేరళ వరదలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? సంబంధం ఉంది ఏంటంటే… నాగచైతన్య నటించిన సినిమా “శైలజారెడ్డి అల్లుడు” రీ-రికార్డింగ్ పనుల్లో ఉంది. ఆ రీ-రికార్డింగ్ కేరళలో జరుగుతుంది. కేరళలో జరిగిన దురదృష్టకర సంఘటన కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ టైమ్ కి కంప్లీట్ చేయలేకపోతున్నాం.

మూవీ రిలీజ్ డిలే అవుతున్నందుకు మీ అందరిని క్షమాపణ వేడుకుంటున్నాను. త్వరలోనే మూవీ మేకర్స్ ఓకే డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారు. కేరళకి మీవంతు సహాయం అందించామని వేడుకుంటున్నాను. కేరళ త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసాడు నాగచైతన్య.