నాగశౌర్య ని ‘అశ్వద్ధామ’ఒడ్డున పడేస్తాడా?

‘నర్తనశాల’డిజాస్టర్ ,  అమ్మమ్మ గారిల్లు ఫ్లాఫ్ లతో యంగ్ హీరో నాగశౌర్య  కెరీర్ లో బాగా వెనకబడ్డారు. ఛలో హిట్ ని మర్చిపోయేలా ఆ రెండు సినిమాలు చేసాయి. కొద్ది గ్యాప్ తీసుకుని  మళ్లీ కోలుకుని వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన తన బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాకి నాగశైర్య ‘అశ్వద్ధామ’ అనే టైటిల్ ను ఖరారు చేశాడు.

ఈ టైటిల్ ను ఆయన రిజిస్టర్ కూడా చేయించాడట… అందువలన ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. కాగా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రమణతేజ పరిచయమవుతున్నాడు. నాగశౌర్య సరసన హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను జరుపుకుంది. త్వరలోనే ఫస్టులుక్ ను వదిలే ఆలోచనలో వున్నారు.

మరో ప్రక్క ఇప్పటికే సమంతతో ఓ బేబీ సినిమాలో నటించగా.. తాజాగా రాఘవేంద్రరావు కొత్త సినిమా.. ముగ్గురు డైరక్టర్లు, ముగ్గరు హీరోయిన్లతో చేస్తున్న సినిమాలో కూడా నటించనున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి. సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో ఓ సినిమా లైన్ లో వుంది.