నాగ‌శౌర్యకు గాయాలు… షూటింగ్ ర‌ద్దు

వరసపెట్టి యంగ్ హీరోలకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరుణ్ తేజకు కారు యాక్సిడెంట్, అంతకు ముందు హ్యాపీడేస్ హీరో సుధాకర్ కోమాకులకు, అలాగే గ్యాంగ్ లీడర్ సెట్ లో నాని కి షూటింగ్ లో చిన్నదో పెద్దదో ప్రమాదం కనపడుతూనే ఉంది. వీళ్లందరికన్నా ముందు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఎన్టీఆర్ కు, రామ్ చరణ్ కు ఇద్దరికి గాయాలు అయ్యాయి.

తాజాగా నాగశౌర్య హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `అశ్వత్థామ`చిత్రీకరణ దశలో ఉంది. వైజాగ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుండ‌గా నాగ‌శౌర్య కాలికి గాయ‌మైంది.

 

ఈ ఘటనలో నాగ శౌర్య ఎడమకాలికి గాయమయ్యింది. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్టంట్ చేసిన ఈ హీరో 15 అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డాడు. 

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ అంభరివ్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తుండగా హీరో నాగ శౌర్య జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తోంది.  ఐరా ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న నాగ శౌర్య నూతన చిత్రం ప్రస్తుతం విశాఖలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ కార‌ణంగా చిత్ర యూనిట్ షూటింగ్‌ను ర‌ద్దు చేసుకుంది.  

ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగ‌శౌర్య నిర్మాత‌గా, హీరోగా చేసిన `ఛ‌లో` పెద్ద విజ‌యాన్ని సాధించింది. కాగా రెండో చిత్రం న‌ర్త‌న‌శాల‌` డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు మూడో చిత్రం `అశ్వ‌త్థామ‌`(విన‌ప‌డుతున్న టైటిల్‌) షూటింగ్ జూన్ 8నుండి జ‌రుగుతుంది. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

మరో ప్రక్క ఇప్పటికే సమంతతో ఓ బేబీ సినిమాలో నటించగా.. తాజాగా రాఘవేంద్రరావు కొత్త సినిమా.. ముగ్గురు డైరక్టర్లు, ముగ్గరు హీరోయిన్లతో చేస్తున్న సినిమాలో కూడా నటించనున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి. సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో ఓ సినిమా లైన్ లో వుంది.